ETV Bharat / state

'రాష్ట్ర ప్రజలే కేసీఆర్​కు బుద్ధి చెబుతారు' - nalgonda congress president is arrested

జలాశయాల వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసనల దీక్ష నేపథ్యంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్​ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

nalgonda district congress party president got arrested
నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్టు
author img

By

Published : Jun 2, 2020, 11:53 AM IST

నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్​ను పోలీసులు అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. జలాశయాల వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసనల నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డుపాడు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు యత్నిస్తోందని, దీనివల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందని కాంగ్రెస్​ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆంధ్రా ప్రభుత్వం చేస్తున్న కృష్ణా జలాల దోపిడీని అరికట్టాల్సిన సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు.

కేసీఆర్, జగన్ ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జలాశయాల వద్ద నిరసన దీక్షకు పూనుకోవడం వల్ల అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్​కు బుద్ధి చెబుతారని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.