ETV Bharat / state

అనాథాశ్రమానికి అండగా నిలిచిన యోగా సభ్యులు

మతిస్థిమితం లేని అనాథలను చేరదీసి కంటికి రెప్పలా కాచుకుంటున్న అమ్మ-నాన్న అనాథాశ్రమానికి నల్గొండ జిల్లా మిర్యాలగూడ యోగా సభ్యులు అండగా నిలిచారు. మదర్స్​ డేను పురస్కరించుకుని సుమారు 90 వేల విలువ గల నిత్యావసరాలు, దుస్తులను పంపిణీ చేశారు.

miryalaguda yoga club members donated 90 thousand worth groceries to amma nanna orphanage home
అనాథాశ్రమానికి అండగా నిలిచిన యోగా సభ్యులు
author img

By

Published : May 10, 2020, 4:34 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యోగా క్లబ్ ఆధ్వర్యంలో మదర్స్ డే ను పురస్కరించుకుని అమ్మ-నాన్న అనాథాశ్రమానికి రూ. 90 వేల రూపాయల నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. అనాథాశ్రమానికి తమ వంతు సాయం చేయాలనే ఆలోచనతో వాట్సాప్ గ్రూప్​ల ద్వారా డబ్బులు పోగు చేసి బియ్యం, కంది పప్పు, నూనె వంటి నిత్యవసర వస్తువులు, దుస్తులను అందించారు.

మతిస్థిమితం లేని అనాథలను చేరదీస్తున్న అమ్మా-నాన్న ఆశ్రమానికి దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేయాలని యోగా సభ్యులు కోరారు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకు తమ శక్తి కొద్దీ నిరుపేదల ఆకలి తీర్చేందుకు కృషి చేస్తామని యోగా సభ్యులు తెలిపారు.

ఇవీచూడండి: ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. చిన్నారికి కంటి చూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.