ETV Bharat / state

బడికి వెళ్లే పిల్లలను బజారున పడేసిన కరోనా.. - కరోనా రక్షణ సామగ్రి అమ్ముతూ జీవనోపాధి

కరోనా కారణంగా బడికి వెళ్లే పిల్లల నుంచి ఉన్నత విద్యనభ్యసించిన వారి వరకూ బజారున పడ్డారు. ఉపాధి కోల్పోయిన పేదలంతా ఆ కరోనా రక్షణ సామగ్రినే విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇల్లు గడవడం కోసం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అమ్ముతున్నారు.

studednts selling masks and sanitizers in corona time
బడికి వెళ్లే పిల్లలను బజారున పడేసిన కరోనా..
author img

By

Published : Aug 9, 2020, 3:57 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా కారణంగా అనేక వ్యాపారాలు అటకెక్కాయి. ఇల్లు గడవని పేదలు కరోనా రక్షణ సామాగ్రి అమ్ముతూ ఎంతో కొంత ఉపాధి పొందుతున్నారు. పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన సాయి అనే విద్యార్థి తుంగపాడు ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల పాఠశాలలు నడవడం లేదు. కానీ ఆన్​లైన్ విద్యాబోధన అందిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. ఆన్​లైన్ తరగతులు వినేందుకు తన దగ్గర ఫోన్ లేదు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనిచ్చే స్థోమత లేదు. ఎలాగైనా తను కష్టపడి పనిచేసి ఫోన్​ కొనాలనుకున్నాడు. పదో తరగతి పాఠాలను ఆన్​లైన్​లో వినాలనుకున్నాడు.

studednts selling masks and sanitizers in corona time
బడికి వెళ్లే పిల్లలను బజారున పడేసిన కరోనా..

ప్రస్తుతం పాఠశాల నడవట్లేదు. కానీ ఆన్​లైన్​లో పాఠాలు చెబుతున్నారు. నాకు చదువంటే చాలా ఇష్టం. అమ్మవాళ్లకు ఫోన్​ కొనిచ్చే స్థోమత లేదు. అందుకే నేనే కష్టపడి ఫోన్ కొనుక్కోవాలనుకున్నా. అందుకోసమే మాస్కులు, శానిటైజర్లు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నా. – సాయి, విద్యార్థి

అనుకున్నదే తడవుగా... సాగర్ రోడ్ ఫ్లైఓవర్ వద్ద శానిటైజర్లు, మాస్కులు అమ్ముతున్నాడు. సాయి ఒక్కడే కాదు.. స్కూల్ బ్యాగులు విక్రయిస్తూ జీవనం సాగించే మరెంతో మంది కూడా మాస్కులు, శానిటైజర్లు అమ్ముతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యులకు అండగా... పిల్లలు కూడా వ్యాపారాల్లో దిగడం గమనార్హం. ఇందులో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లేక జీవనాధారం కోసం రోడ్లపై స్టాళ్లు పెట్టుకున్న వాళ్లూ ఉన్నారు.

కరోనాతో బతుకు ఛిద్రమై రోడ్లపై చిరు వ్యాపారం చేస్తున్నాం. వీటివల్ల కాస్తంత ఉపాధి దొరుకుతున్నా సరిగ్గా నిలదొక్కుకోలేకపోతున్నాం. మాలాంటి వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. – చిరు వ్యాపారస్థుడు

లాక్​డౌన్ ప్రారంభమైన రోజు నుంచీ తమకు కష్టాలు మొదలయ్యాయని... ఇప్పటికీ ఆ కష్టాలు తీరట్లేదని చిరు వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తిండి లేక ఇబ్బంది పడ్డ తాము... మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అమ్ముతూ కాస్తంత ఉపాధి పొందుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వమే తమని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.