నాగార్జున సాగర్‌ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నందికొండ పురపాలిక సంఘంలోని హిల్ ,పైలాన్ కాలనీల్లో ఆయన పర్యటించారు. అనంతరం నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖల అధికారులతో విజయ్ విహార్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
స్థానిక సంస్థల పాలన లేకపోవడమే..
నందికొండ పురపాలక సంఘంలో ఉన్న సమస్యల పరిష్కారించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సాగర్‌లో ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యపనులపై తక్షణ చర్యలుతీసుకోవాలని సూచించారు. గతంలో స్థానిక సంస్థల పాలన లేకపోవడం వల్లనే సాగర్‌లో ఇన్ని సమస్యలకు కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తెరా చిన్నపు రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సాగర్‌ని నందికొండ మున్సిపాలిటీగా ఏర్పాటుచేసి అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్దిచెందిన సాగర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పురపాలికల్లో నీటి సరఫరా,విద్యుత్ ను ఎన్ఎస్పీ నుంచి పురపాలకసంఘంకు బదిలీ చేసి అన్ని సమస్యలను త్వరితగతినపూర్తి చేస్తాం.
-జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: తొలిగించిన బీసీ వర్గాలను జాబితాలో చేర్చాలి : ఆర్.క్రిష్ణయ్య