నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పవర్ ప్లాంట్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు.
రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యంగా నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద 4వేల మెగావాట్లతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కరోనా లాక్డౌన్లో కూడా పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. రూ.28 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును జెన్కో ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ నిర్మిస్తుంది.
విద్యుత్ కేంద్రంలో కీలకమైన బాయిలర్ సివిల్ ఇంజినీరింగ్ పనులు, చిమ్మిల నిర్మాణం, కూలింగ్ టవర్, నీటిశుద్ధి ప్లాంట్, బొగ్గు దిగుమతి తరలింపునకు నిర్మాణ పనులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఇంజినీర్లతో పవర్ప్లాంట్ పనులపై సమీక్ష నిర్వహించి పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.