ETV Bharat / state

సభ విజయాన్ని ఓర్వలేకే విమర్శలు: జగదీశ్​ రెడ్డి - కాంగ్రెస్​ నాయకుల విమర్శలపై మంత్రి జగదీశ్​ రెడ్డి ఆగ్రహం

హాలియాలో సీఎం సభ విజయవంతం కావడంతోనే కాంగ్రెస్​ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి జగదీశ్​ రెడ్డి మండిపడ్డారు. జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్​ విసిరినా జానారెడ్డి స్పందించలేదని నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు.

minister jagadish reddy comments in congress leaders in nalgonda district
నల్గొండలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్​ రెడ్డి
author img

By

Published : Feb 11, 2021, 8:38 PM IST

జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్​ విసిరినా జానారెడ్డి స్పందించలేదని రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో సీఎం సభ విజయవంతం చేసినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధిని గాలికొదిలేసి... ఫ్లోరైడ్​, కరువు కాటకాలకు నిలయంగా మార్చారని కాంగ్రెస్​ నాయకులను విమర్శించారు.

ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే పెద్ద నాయకులం అవుతామన్న భ్రమలో విపక్ష పార్టీల నేతలు ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. హాలియా సభ విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

సభ విజయాన్ని ఓర్వలేకే విమర్శలు : జగదీశ్​ రెడ్డి

ఇదీ చూడండి : ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.