ETV Bharat / state

పత్తిచేనుపై మిడతలు.. పరిశీలించిన వ్యవసాయాధికారులు!

author img

By

Published : Jul 28, 2020, 11:15 AM IST

నల్గొండ జిల్లా మునుగోడు పరిధిలో పత్తిచేనుపై వాలిన మిడతలను మునుగోడు వ్యవసాయాధికారులు సందర్శించారు. పంట చేనుపై వాలిన మిడతలు మామూలువే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతుకు వ్యవసాయాధికారులు ధైర్యం చెప్పారు.

Locusts fliying on cotton crop in nalgonda district
పత్తిచేనుపై వాలిన మిడతలు.. రైతు ఆందోళన!

నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొంపల్లి గ్రామానికి చెందిన జాల నర్సింహ అనే రైతు తనకున్న పొలంలో పత్తిచేను వేశాడు. ఎప్పట్లాగే.. చేనుకు వెళ్లిన రైతు పత్తి మొక్కల మీద మిడతలు వాలడం గమనించాడు. వెంటనే మండల వ్యవసాయాధికారులకు సమాచారం అందించాడు. పత్తి చేనును పరిశీలించిన వ్యవసాయాధికారి శ్రీనివాస్​ గౌడ్​ అవి మామూలు మిడతలేనని.. కేవలం ఒక్క చెట్టుపై మాత్రమే వాలాయని, విస్తరించే ప్రమాదం లేదని తెలిపారు. పంట నష్టం చేసే జాతి మిడతలు ఇవి కావని.. దేశంలో పలు రాష్ట్రాల్లో పంటల మీద దాడి చేసిన మిడతలు ఇవి కాదని రైతుకు భరోసా ఇచ్చారు.

ఒకవేళ మిడతలు ఎక్కువగా వాలితే.. లీటర్​ నీటిలో 50 ఎంఎల్ క్లోరోపైరిపాస్, లీటర్​ నీటిలో లామీడాసలోత్రిన్​ 1ఎంఎల్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. కొంపల్లి సర్పంచ్​ జాల వెంకన్న యాదవ్, ఏఈవో యాదగిరి, వహీద్ తదితరులు రైతు పొలాన్ని సందర్శించి ధైర్యం చెప్పారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.