పట్టించుకోని ప్రజాప్రతినిధులు...
శిఖం భూమిని తమకు పట్టా చేసి ఇవ్వాలని పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఎకరాల భూమిని తలా కొంత సాగు చేసుకుంటూ బతుకీడుస్తున్నామన్నారు. తమ జీవనాధారాన్ని లాక్కుని అడువులు పెంచటం వల్ల తాము అన్యాయమైపోతామని గోడు వెళ్లబోసుకున్నారు.
నచ్చజెప్పుతున్న అధికారులు...
ప్రభుత్వ శిఖం భూములుగా గుర్తించి హరితహారం కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే తాము సర్వే చేస్తున్నట్లు చెబుతున్నారు. తమని అడ్డుకున్నంత మాత్రాన ఎలాంటి న్యాయం జరగదని గ్రామస్థులకు నచ్చజెప్పుతున్నారు.
ప్రాణాలకైనా తెగించి తమ భూములకోసం పోరాడతామని జంగాల గూడెం వాసులు ఉద్ఘాటిస్తున్నారు. సీఎం కేసీఆర్తో సహా పలువురు నేతలు ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!