ETV Bharat / state

తెలంగాణ​ ఫార్మేషన్ డే కాదు.. బ్లాక్​ డే: కోమటిరెడ్డి, జానా

author img

By

Published : Jun 2, 2020, 4:39 PM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాదని, బ్లాక్​ డే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్ నియంతపాలనకు చరమగీతం తప్పదని హెచ్చరించారు.

Janarde Reddy and MP Komati Reddy outrage on government due to their arrest in Nalgonda
ఆవిర్భావ దినోత్సవం కాదు బ్లాక్​ డే: ఎంపీ వెంకటరెడ్డి

పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి దుయ్యబట్టారు. దేవరకొండలో పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం కోసం వెళ్తుంటే తమని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని.. ఇదే విధంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు చేస్తే ప్రత్యేక రాష్ట్ర సాధన జరిగేదా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ ఓ నియంత అని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కాదు బ్లాక్ డే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతుందని.. కరోనా నిబంధనల పేరుతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు.

"మా సొంత జిల్లాలకు వెళ్లడానికి కూడా మమ్మల్ని అనుతించడం లేదు. ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు- ఎంపీ వెంకటరెడ్డి

అరెస్టులు అప్రజాస్వామికం. దేవరకొండలోని పార్టీ కార్యాలయానికి వెళ్లడానికి మమ్మల్ని అనుమతించకపోవడం సరికాదు- జానారెడ్డి"

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.