ఏపీ నుంచి వచ్చే పంటలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వంతెనపై భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీ రైతులు తెలంగాణలో అధిక ధరలకు అమ్ముకోవడం కోసం తీసుకొస్తున్న పంటలను సరిహద్దులో నిలిపేయడం అన్యాయమని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సీఎం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.