మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నూతనంగా అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు, వ్యవసాయ ప్రణాళిక సన్నద్ధతపై.. నల్గొండ కలెక్టరేట్ లో రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. శాస్త్రవేత్తలు, వ్యవసాయ, మార్కెటింగ్ నిపుణులతో చర్చించి నూతన వ్యవసాయ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రైతులకు 24గంటల కరెంట్, నీళ్లు
తెలంగాణ రైతాంగాన్ని సంఘటితం చేసి లాభాలు పొందే విధంగా కేసీఆర్.. నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి వెల్లడించారు. రైతులకు 24గంటల కరెంట్, నీళ్లు, రైతుబంధు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నమన్నారు. సీఎం రైతులను ఐక్యం చేయడానికి నియంత్రిత విధానాన్ని ముందుకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మార్కెట్ లో ఉన్న పంట డిమాండ్ బట్టి.. రైతులను సమాయత్తం చేస్తున్నమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ