ETV Bharat / state

Farmers protest at Vemulapalli: భగ్గుమన్న అన్నదాత... ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన.. - తెలంగాణ తాజా వార్తలు

నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద అద్దంకి నార్కెట్​పల్లి రహదారిపై రైతులు ధర్నాకు దిగారు (Farmers protest at Vemulapalli). మిల్లుల యజమానులు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

protest
protest
author img

By

Published : Oct 27, 2021, 3:39 PM IST

మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనాలంటూ (minimum support price) నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద రైతులు ధర్నా చేపట్టారు (Farmers protest at Vemulapalli ). మిల్లుల యజమానులు సకాలంలో ధాన్యం కొనడంలేదని ఆందోళన తెలిపారు. నిన్న, మొన్నటి వరకు క్వింటాకు రూ.1,820 ఇవ్వగా... బుధవారం నుంచి రూ.1,600 నుంచి 1,700 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా

మిర్యాలగూడ సాగర్ ఆయకట్టులో ముందుగా సాగుచేసిన పంటను అమ్మేందుకు తీసుకొచ్చి రెండురోజులుగా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నామని అన్నారు. పచ్చని వడ్లు ట్రాక్టర్‌లో నిల్వ ఉంటే రంగుమారతాయని... దానిని సాకుగా చూపి మరింత తక్కువ రేటు ఇస్తారని మండిపడ్డారు. శెట్టిపాలెం పరిసరాల్లో 15 మిల్లులు ఉంటే 2 మిల్లుల్లో మాత్రమే ధాన్యం కొంటున్నారని తెలిపారు. మిల్లు యజమానుల తీరుతో విసుగుచెందిన అన్నదాతలు... అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ఆందోళన చేశారు. రైతుల ధర్నాతో ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం వచ్చాము. ఇప్పటి వరకు మిల్లు గేట్లు తీయలేదు. పచ్చి ధాన్యం ఎండిపోతే పనికిరాదు. నూకలైపోతాయి. వాటిని రూ. 1500 కూడా కొనరు. వాళ్లకు ఇష్టం వచ్చిన రేటుకు కొంటున్నారు. టోకెన్లు ప్రకారం కొంటామని చెబుతున్నారు. అదికూడా సవ్యంగా జరగడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. - రైతులు

ఇదీ చూడండి: Huzurabad by elections 2021: హుజూరాబాద్​లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.