ETV Bharat / state

ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని పాటించాలి: జగదీశ్​ రెడ్డి - ambedkar jayanti 2021

నల్గొండ జిల్లా హాలియాలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్​, కోనేరు కోనప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ambedkar jayanti in haliya
హాలియాలో అంబేడ్కర్​ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 14, 2021, 12:37 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్​ అంబేడ్కర్​ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో అంబేడ్కర్​ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి జగదీశ్​ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, సిర్పూర్​ ఎమ్మెల్యే కోనప్ప.. స్థానిక బస్టాండ్​ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్​ సేవలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: త్వరలోనే హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.