నల్గొండ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు, మునుగోడు మండలాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. నీరంతా దిగువ ప్రాంతానికి వృథాగా పోయాయి. చండూరు మండలంలో 15ఎకరాల పత్తిపంట నీటిలో మునిగిపోయింది. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో రెండున్నర ఎకరాల పత్తిపంట వరదలో కొట్టుకుపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు.
ఇవీచూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్