ETV Bharat / state

ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలి: చెరుకు సుధాకర్​ - ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ చెరకు సుధాకర్ సమావేశం

నల్లొండ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడం సరికాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ గట్టుప్పల్​ గ్రామంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

cheruku sudhakar was organized an all-party meeting seeking revocation of pharma company licenses
ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలి: చెరుకు సుధాకర్​
author img

By

Published : Jan 24, 2021, 6:01 PM IST

గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరకని మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఫార్మా కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం సరికాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా పుట్టపాక గ్రామ శివారులో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని చండూర్ మండలం గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ శివారులో కాంతి లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతినివ్వడం దారుణమని తెలంగాణ ఇంటి పార్టీ నల్గొండ జిల్లా అధికార ప్రతినిధి బైరి వెంకన్న అన్నారు. 15రోజుల్లోగా అనుమతులు రద్దు చేయకపోతే భారీ ఎత్తున ధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడెం కైలాసం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సూరత్​లో తెలంగాణ అధికారుల మృతి.. మంత్రి సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.