ETV Bharat / state

12 శాతం కంటే తేమ ఎక్కవగా ఉంటే కొనేది లేదు: సీసీఐ - పత్తి తాజా వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు సీసీఐ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభం కాగా.. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఈ సీజన్​లో పెద్ద ఎత్తున తెల్ల బంగారం సాగైనా.. గత నెలలో కురిసిన వర్షాలకు భారీగా పంటను కోల్పోవాల్సి వచ్చింది. మిగిలిన సరకునైనా కొంటారా లేదా అన్న సంశయం నడుమ సీసీఐ కేంద్రాలు మొదలవుతున్నాయి.

cci cotton purchases in nalgonda district
12 శాతం కంటే తేమ ఎక్కవగా ఉంటే కొనేది లేదు: సీసీఐ
author img

By

Published : Nov 11, 2020, 8:29 AM IST

పత్తి పంటను నమ్ముకున్న వేలాది మంది రైతులు గత నెలలో కురిసిన వర్షాలతో దిగుబడులు కోల్పోయి కుదేలయ్యారు. దాదాపు 70 వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ ఏడాది ఐదారు క్వింటాళ్లు దక్కడమే గగనమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో పదిన్నర లక్షల ఎకరాల్లో తెల్లబంగారాన్ని సాగు చేశారు. అయితే సకాలంలో సీసీఐ కేంద్రాలు తెరవకపోవడం వల్ల దళారులు రంగ ప్రవేశం చేశారు. మూడున్నర వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తూ రైతుల పొట్టగొట్టారు. మిగిలిన పంటైనా సీసీఐ కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. సీసీఐ గతేడాది క్వింటాకు రూ.5,550 చెల్లించగా ఈసారి రూ.5,825 చెల్లించనుంది.

దీపావళి తర్వాత అన్ని చోట్ల కొనుగోళ్లు

ఎనిమిది శాతం తేమతో కూడిన తెల్లబంగారానికి మాత్రమే రూ.5,825 చెల్లిస్తారు. అయితే 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయనుండగా... అంతకు పైస్థాయిలో ఉంటే తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత అన్ని చోట్ల కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 మిల్లులు ఉండగా... మంగళవారం వరకు 16 మిల్లుల పరిధిలో కొనుగోళ్లు జరిగాయి. గత మూడు రోజుల్లో నల్గొండ జిల్లాలో 2 వేల మంది రైతుల వద్ద 70 వేల క్వింటాళ్లు... యాదాద్రి జిల్లాలో 325 మంది రైతుల నుంచి 5,129 క్వింటాళ్లు కొన్నారు.

అనుకున్న దానికంటే తక్కువగా వచ్చే అవకాశం

నల్గొండ జిల్లాలో గతేడాది 29 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగలు చేశారు. ఈసారి 30 లక్షల క్వింటాళ్ల తెల్లబంగారం వస్తుందని భావిస్తున్నా... అంతకన్నా తక్కువ వచ్చే అవకాశముందని అంటున్నారు. సూర్యాపేట జిల్లాలో గతేడాది 3 లక్షల 33 వేల క్వింటాళ్లు కొన్నారు. ఈసారి 12 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. యాదాద్రి జిల్లాలోనూ 14 లక్షల 40 వేల క్వింటాళ్లు వస్తుందని లెక్కలున్నా... అక్కడా సరకు తగ్గిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇదీ చదవండి: భాజపా గెలుపుతో కాంగ్రెస్ నేతల్లో ‌ఆందోళన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.