నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంప సాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ రంగంలో ఇంధన పొదుపు వినియోగము, సామర్థ్యంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు 200 మంది రైతులు హాజరయ్యారు. విద్యుత్ మోటార్ల వినియోగంలో విద్యుత్ వాడకం, ట్రాక్టర్లో డీజిల్, పెట్రోల్ వాడకం, సౌర విద్యుత్ గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ మోటార్లు, ఎరువుల కంపెనీ ప్రతినిధులు స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు అన్ని స్లాళ్లు తిరుగుతూ విద్యుత్ మోటార్ల గురించి అడిగి తెలుసుకున్నారు
ఇవీ చూడండి: చైతన్యపురిలో ట్రాక్టర్ బీభత్సం