నల్గొండ జిల్లాకు మరో మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు అమలు చేస్తూ ఎత్తిపోతలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములపల్లి వద్ద 9.3 కోట్ల రూపాయల వ్యయంతో తోపుచెర్ల ఎత్తిపోతల పథకం చేపట్టనున్నారు. దామరచెర్ల మండలంలో తుంగపాడు వాగుపై 32.22 కోట్ల వ్యయంతో వీర్లపాలెం - రెండో దశ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. కట్టంగూరు మండలం చెరువు అన్నారం సమీపంలో 101.62 కోట్ల వ్యయంతో అయిటిపాముల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు. అటు నెల్లికల్లు ఎత్తిపోతల పథకం స్వరూపం, పనుల్లో మార్పులు చేశారు.
గతంలో జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసిన ప్రభుత్వం... నెల్లికల్లు వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం సహా ఇతర పనులకు తాజాగా అనుమతి ఇచ్చింది. గతంలో చేపట్టిన నెల్లికల్లు పనులను ప్రీక్లోజర్ చేసి మళ్లీ టెండర్ పిలవనున్నారు. ఈ మేరకు 664.80 కోట్ల వ్యయంతో నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి తాజాగా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: CM KCR Speech: 'సాగర్‌కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'