నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్మశానవాటికలో జరుగుతున్న మారుతీరావు అంత్యక్రియలకు అమృత హాజరైంది. మొదట వచ్చేందుకు నిర్ణయించుకున్న అమృత... బంధువుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో విరమించుకుంది. కట్ చేస్తే.. పోలీసుల బందోబస్తు నడుమ శ్మశానవాటికకు చేరుకుంది.
తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. మృతదేహం వద్దకు రాకుండా అడ్డుగా నిలిచారు. "గోబ్యాక్ అమృత" నినాదాలతో శ్మశానవాటిక దద్దరిల్లిపోయింది. ఎంతసేపటికీ బంధువులు తన తండ్రిని చూసే అవకాశం కల్పించకపోవటం వల్ల తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అమృత వెనుదిరిగింది.