ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ షాబునగర్లోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మారుతీరావు మృతదేహానికి పట్టణ వాసులతోపాటు పలువురు నివాళులర్పించారు. మారుతీరావు కుంటుబసభ్యులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కలిసి... ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మారుతీరావు మృతదేహాన్ని సందర్శించేందుకు... ఆయన కూతురు అమృత వర్షిణి ఆసక్తి చూపినట్లు తెలిసింది. అయితే ఇందు కోసం పటిష్ఠ భద్రతనివ్వాలని... పోలీసులను కోరింది. కన్నతండ్రిని కడసారి చూసుకోవాలని భావించిన ఆయన కూతురు నిర్ణయాన్ని... తల్లి తరఫు బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమృత రాకను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి అమృత కూడా... తన నిర్ణయాన్ని మార్చుకుంది. మొత్తానికి కూతురు రాకుండానే... మారుతీరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు