నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో మద్యంపై మహిళలు ఉద్యమిస్తున్నారు. తక్షణమే బెల్టు షాపులు బంద్ చేసి గ్రామంలో మద్యంపై నిషేధం విధించాలంటూ డిమాండ్ చేస్తన్నారు. కిరాణం షాపులో మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం వల్ల ఏర్పడే సమస్యలను ప్రజలకు అర్థమయ్యేలా ఊరేగింపు ద్వారా తెలియజేశారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. అంతకుముందు గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించి నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేశారు.
ఇవీ చూడండి: భారీ ధరకు 'దర్బార్' హక్కులు.. 'తలైవా' డబుల్ సెంచరీ