నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు అనిల్ కుమార్, స్వాతి అనే ఈతకని వెళ్లి నీటికుంటలో పడి మృతి చెందారు. వీరితో పాటు శైలజ అనే మరో చిన్నారి కూడా చనిపోయింది. గణేష్ అనే చిన్నారిని స్థానికులు గుర్తించి కాపాడి... నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో గ్రామమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి : రైలు కింద పడి ఏఎస్ఐ మృతి