తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కొల్లాపూర్ వైపునకు రాయలసీమ జిల్లాల నుంచి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా... సరిహద్దు ప్రాంతమైన కొల్లాపూర్లోని పలు గ్రామాలను ఆయన పరిశీలించారు. కర్నూలు జిల్లా నుంచి పడవల్లో తెలంగాణకు ఎవ్వరూ రాకుండా చూడాలని పోలీసులకు సూచించారు. ఇళ్ల నుంచి ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. ఎవరైనా పక్క జిల్లాలైన గద్వాల, కర్నూలు నుంచి నదిలో పడవల ద్వారా వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం