ETV Bharat / state

'కొవిడ్​ నిబంధనలతో పుర ఎన్నికలకు ఏర్పాట్లు' - అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈనెల 30న జరగనున్న పుర ఎన్నికలకు ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నట్లు నాగర్ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​ తెలిపారు. అచ్చంపేటలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు.

acchampet , nagar kurnool dist
అచ్చంపేటలో పురఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్​ శర్మన్
author img

By

Published : Apr 17, 2021, 6:59 PM IST

కొవిడ్ తీవ్రత దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా పుర ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని నాగర్ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​ వెల్లడించారు. ఈనెల 30న జరగబోయే ఎన్నికల నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో అధికసంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉందన్నారు. అచ్చంపేటలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా పాలనాధికారి పరిశీలించారు.

ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, పురపాలిక సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 19న నామనేషన్ల పరిశీలన, 20న తిరస్కరణ, 22 ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మే 3 వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని జిల్లా పాలనాధికారి శర్మన్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'వైరస్‌ బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.