ETV Bharat / state

నల్లమలలో ముంబయి మహిళ మృతదేహం

ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం, హత్య చేసి... మృతదేహాన్ని నల్లమల అడవిలో పడేశారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను బట్టి మృతురాలు ముంబయివాసిగా పోలీసులు గుర్తించారు.

నల్లమలలో ముంబయి మహిళ మృతదేహం
నల్లమలలో ముంబయి మహిళ మృతదేహం
author img

By

Published : Feb 2, 2020, 8:06 PM IST

నాగర్​కర్నూలు జిల్లా అమ్రాబాద్​ మండల పరిధిలోని నల్లమల అడవిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో... అక్కమ్మ దేవీ ఆలయానికి వెళ్లే దారిలో అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఘటనాస్థలంలో నిమ్మకాయలు, కుంకుమ, అగర్​బత్తీలు ఉన్నాయి. వీటిని బట్టి క్షుద్రపూజల కోసం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం వద్ద ఫొటో, ఆధార్​ కార్డు, పాటు బ్యాగు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు ముంబయికి చెందిన శాంత రవి ముదలియార్​గా గుర్తించారు.

దోమలపెంట అటవీశాఖ అధికారుల సమాచారం మేరకు... అచ్చంపేట డీఎస్పీ నరసింహులు, అమ్రాబాద్ సీఐ బిసన్న ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆధారాల ప్రకారం నిందితులని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ నరసింహులు తెలిపారు. మహిళలు అడవిలోకి వెళ్లకూడదని నల్లమల ప్రాంత ప్రజలకు సూచించారు.

నల్లమలలో ముంబయి మహిళ మృతదేహం

ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.