ETV Bharat / state

మొబైల్​ చూడు - ఒకవైపే చూడు - రెండోవైపు చూడకు - జీవితం నాశనం చేసుకోకు - INTERNET SKILLS AMONG STUDENTS

సామాజిక మాధ్యమాల్లో గంటల కొద్దీ సమయం వృధా చేస్తున్నారా - అయితే మీరు మీ జీవితంలో చాలా కోల్పోయినట్లే - ఇంటర్నెట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి లుక్కేయండి.

INTERNET USING TIPS FOR STUDENTS
Internet Using For Students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 10:01 AM IST

Internet Using For Students : 'చూడు.. ఒక వైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు’ సింహా సినిమాలో బాలకృష్ణ పంచ్‌ డైలాగ్‌ ఇది. అంతర్జాలం వాడే విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మనకు ఏం కావాలో అదే చూడాలి. మన నైపుణ్యాలు పెంచుకోవాలి. ఏవిపడితే అవి చూస్తే జీవితాలే నాశనం అవుతాయి. నైపుణ్యాలు నేర్చుకోవడంలో అంతర్జాలాన్ని చక్కగా వాడుకుని ఎందరో ప్రయోజకులు అయ్యారు.

సామాజిక మాధ్యమాలలో మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు ఉంటుంది. ఏం చేయాలన్నా మీరు చేసే దానిపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాలంలో మునిగి తేలుతూ, సామాజిక మాధ్యమాలతో గంటల కొద్దీ సమయం వృథా చేస్తున్న వారిని ఎంతో మందిని చూస్తున్నాం. విద్యార్థులు, యువకులు ఎక్కువగా వీటి ప్రభావానికిలోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆర్థిక నష్టాలకు గురవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు మాత్రం అంతర్జాలాన్ని ఆయుధంగా వాడుకుని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు.

విజ్ఞానం పెంచుకోడానికి గూగుల్‌ : సామాజిక మాధ్యమాల్లో వచ్చేదంతా చెత్త కాదు. మంచి కంటెంట్‌ ఉంటుంది. విజ్ఞానం పెంచుకోడానికి గూగుల్‌ను వెతుకుతాం. లభించిన సమాచారం నిర్ధారించుకోవడానికి అంతర్జాలంలోనే అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త కొత్త అంశాలను తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆలోచనలు, నిరాశ, ఉన్నవారు మోటివేషన్‌ ప్రసంగాలతో తమను తాము మార్చుకోవచ్చు. యూట్యూబ్​లో మీకు వచ్చిన నైపుణ్యాన్ని పోస్ట్ చేసి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు.

కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు : ఆధ్యాత్మిక సంస్థల వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రసంగాలతో మానసిక వికాసాన్ని సాధించవచ్చు. కొత్త భాషలు నేర్చుకోడానికి, ఆరోగ్య సలహాలు పొందడానికి, ఎందరో నిపుణులను వర్చ్యువల్‌లో కలవడానికి అంతర్జాలం ఉపయోగపడుతుంది. దూరదృశ్య సమావేశాలతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. పంటలు ఎలా వేయాలో నేర్చుకోవచ్చు. రుచికరమైన వంటలు, మార్కెటింగ్, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, బుకింగ్‌ వంటి ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు.

అంతర్జాలంలో ఒక్కోసారి పక్కదారి పట్టి చెడు వాటిని చూస్తారు. ఇలా చేస్తే మీ సమయం వృథా అవుతుంది. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతారు. డిజిటల్‌ డిటాచ్‌’ అనే భావన అంతర్జాతీయంగా వస్తోంది. అమెరికా, యూకే వంటి దేశాల విశ్వవిద్యాలయాలు ఎన్నో సర్టిఫికెట్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాయి. అందుకు సంబంధించిన వెబ్‌సైట్లు ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా వాటిని అభ్యసించి నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు సరికొత్త రూపాల్లో విజృంభిస్తున్న వేళ అప్రమత్తత అవసరం. వేధింపులు, బ్లాక్‌మెయిలర్స్, ఫేక్‌లింక్‌లతో జాగ్రత్తగా ఉండాలి.

రూమర్స్ ఫార్వార్డ్ చేస్తున్నారా - అయితే చిక్కుల్లో పడ్డట్టే!

ఆన్​లైన్​లో మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండాలా? ఈ 13 టిప్స్ మీ కోసమే! - Protect Personal Information Online

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.