Hardik Pandya Syed Mushtaq Ali Trophy : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా తరఫున ఆడుతున్న పాండ్య, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రేర్ ఫీట్ సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు స్కోర్ చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బరోడా ఐదు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే చేధించింది. ఇక ఐదో స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్ (74*) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అంతేకాకుండా టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. మరోవైపు హార్దిక్‌తో పాటు శివాలిక్ శర్మ (64) కూడా రాణించాడు. బ్యాటింగ్‌తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
టీ20 క్రికెట్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లు వీళ్లే :
- హార్దిక్ పాండ్య- (5,067 పరుగులు, 180 వికెట్లు)
- రవీంద్ర జడేజా - (3,684 పరుగులు, 225 వికెట్లు)
- అక్షర్ పటేల్ -(2,960 పరుగులు, 227 వికెట్లు)
- కృనాల్ పాండ్య- (2,712 పరుగులు, 138 వికెట్లు)
- ఇర్ఫాన్ పఠాన్ - (2,020 పరుగులు, 173 వికెట్లు)
గుజరాత్ తుది జట్టు : అక్షర్ పటేల్ (కెప్టెన్), సౌరవ్ చౌహాన్, రవి బిష్ణోయ్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), రిపాల్ పటేల్, ఆర్య దేశాయ్, ఉమంగ్ కుమార్, హేమంగ్ పటేల్, తేజస్ పటేల్, చింతన్ గజా, అర్జన్ నగవస్వాల్లా.
బరోడా తుది జట్టు : కృనాల్ పాండ్య (కెప్టెన్), హార్దిక్ పాండ్య, భాను పానియా,మితేశ్ పటేల్ (వికెట్ కీపర్), విష్ణు సోలంకి, నినాద్ అశ్విన్‌కుమార్ రథ్వా, అహిత్ షేత్, మహేశ్ పిథియా, శివాలిక్ శర్మ, లుక్మాన్ మేరీవాలా, రాజ్ లింబాని.
'మేం కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురయ్యా - కోహ్లీ, హార్దిక్ కాపాడారు' - రోహిత్