దళిత బహుజనులకు తెరాస పాలనలో ఉన్నత స్థానం దక్కిందని ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజేఆర్ ట్రస్ట్, నెలపొడుపు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మావతిలను ఘనంగా సన్మానించారు.
ఉద్యమకారులకు పెద్దపీట..
జిల్లాలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్ పూజకుల దామోదర్ రెడ్డి, ఎంపీ, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి వారిని గజమాలతో సత్కరించారు.
నాగర్‌కర్నూల్ ప్రాంతం అభివృద్ధి చేయడానికి తనకు అవకాశం రావడం గర్వకారణమని ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కవులు, కళాకారులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు.
ఉద్యమంలో ప్రజలను ఒకతాటిపై తీసుకొచ్చేందుకు గోరేటి వెంకన్న ఎన్నో పాటలు పాడి, రచించారు. ఉద్యమానికి జీవం పోశారు. అలాంటి వ్యక్తి ఈ ప్రాంత వాసి కావడం మనకెంతో గర్వకారణం. కొల్లాపూర్ చౌరస్తాకు మహేంద్రనాథ్ పేరు నామకరణం చేస్తాం. భారీ విగ్రహం ఏర్పాటు చేస్తాం.
-మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే
ప్రజా శ్రేయస్సుకు..
ఉద్యమ నేతకు ఎమ్మెల్సీ పదవి రావడం చాలా సంతోషకరమని ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. అన్నీ వర్గాల వారిని ఆదరించేది కేసీఆర్ ప్రభుత్వమేనని గోరేటి వెంకన్న అన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కృషిచేస్తానని తెలిపారు. ఉద్యమకారుడు సాయి చంద్ ఆటపాట, ధూమ్‌ధామ్‌తో అందరిని అలరించాడు.
ఇదీ చూడడం: రాజ్‌భవన్ ఘెరావ్... పోలీసుల అదుపులో వీహెచ్