ETV Bharat / state

బీడు భూములు లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

గత 30 ఏళ్ల నుంచి జిల్దార్​ తిప్ప ప్రాజెక్ట్ నుంచి సాగునీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి పేర్కొన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా రైతులకు సాగునీరు అందించడం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జిల్దార్ తిప్ప చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు.

MLA Harshavardhan Reddy examines the work of the Zildar Thippa project with Irrigation officials
బీడు భూములు లేకుండా చేస్తాం
author img

By

Published : May 9, 2020, 10:48 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల అటవీ ప్రాంతమైన మొలచింతలపల్లి దగ్గర ఉన్న జిల్దార్ తిప్ప ప్రాజెక్ట్​ను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. కృష్ణానది జలాల నుంచి చెరువును నింపి రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిపాదనలు ప్రభుత్యానికి అందజేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించి పంటలు పుష్కలంగా పండే భూములను తయారుచేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, రైతులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.