నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 300 మంది ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటించాలని తెలిపారు.
పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. తెరాస ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉందని వెల్లడించారు. ముస్లింలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.