నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో తెరాసకు చెందిన వారే రెండు వర్గాలు విడిపోయి ఉత్కంఠ రేకెత్తించారు. కల్వకుర్తి, ఊరుకొండ మండలాలకు చెందిన 13 మంది డైరెక్టర్లు ఇరువర్గాలుగా విడిపోయిన అనంతరం అధికారులు ఓటింగ్ ఏర్పాటు చేశారు.
పీఏసీఎస్ అధ్యక్షునిగా తలసాని జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్యాంసుందర్ ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి కల్వకుర్తి పురపాలిక ఛైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ సాహెద్, తెరాస పార్టీకి చెందిన నాయకులు అభినందనలు తెలిపారు.
- ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా