నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి కాయకల్ప అవార్డు వరించింది. 2019 - 2020 సంవత్సరానికి ఈ పురస్కారానికి ఎంపిక అయినట్లు ఆస్పత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్ రమేష్ చంద్ర తెలిపారు.
సేవలు, పరిశుభ్రత చర్యలను పరీశీలించిన కమిటీ సభ్యులు అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. దీని కింద ఆస్పత్రికి రూ.లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారని ఆయన వివరించారు. కాయకల్ప అవార్డుకు ఎంపికకు వైద్యులు, సిబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.
ఇవీచూడండి: గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు