ETV Bharat / state

'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా' - కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

పాలమూరు జిల్లాలో ఇద్దరు మహిళలను అభ్యర్థులుగా ప్రకటించామని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. వారిని గెలిపించాల్సిన అవసరం ఉందని.. జిల్లా అభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా'
author img

By

Published : Apr 8, 2019, 7:57 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన భాజపా విజయ్​ సంకల్ప సభకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్​ లోక్​సభ అభ్యర్థులుగా మహిళలకు అవకాశం ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీకె అరుణ, బంగారు శ్రుతి, పెద్ద ఎత్తున కాషాయ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా'
ఇవీ చూడండి: లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.