ETV Bharat / state

విలీనం తెచ్చిన కష్టం

ఏ గ్రామమైనా పురపాలక సంఘంలో  విలీనమైతే అభివృద్ధి జరుగుతుందని భావిస్తాం. కానీ అచ్చంపేటలోని 8 గ్రామాల పరిస్థితి పూర్తి భిన్నం. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల అలసత్వం వెరసి ఆయా గ్రామాలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.

మిషన్​ భగీరథ
author img

By

Published : Feb 15, 2019, 4:58 PM IST

Updated : Feb 25, 2019, 6:01 PM IST

అచ్చంపేటలో విలీనంపై 8 గ్రామాల ప్రజల ఆందోళన
నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలోని 8 గ్రామాల ప్రజలను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియోజకవర్గ పరిధిలోని లక్ష్మాపూర్​, నడింపల్లి, పులిజాల, లింగోటం, పోలిశెట్టి పల్లి, చౌటపల్లి, గుంపన్​ పల్లి గ్రామాలను అచ్చంపేటలో విలీనం చేసి పురపాలక సంఘంగా మార్చింది. తమ గ్రామాలను పంచాయతీలుగానే ఉంచాలని అప్పట్లో స్థానికులు ధర్నా చేశారు.

ఉపాధి హామీ పోయింది ఇప్పటికే ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. మిషన్​ భగీరథ ద్వారా సరఫరా చేసినప్పటికీ.. అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. సరైన రహదారి సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మున్సిపాలిటీగా మారడం వల్ల ఉపాధి పనులు ఆగిపోయి పని కరువైంది. పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది. ప్రతి చిన్న పనికీ అచ్చంపేట వెళ్లాల్సి వస్తుందని.. తమ సమస్యలను అధికారులకు విన్నవించడానికి ప్రయత్నించినా వారు అందుబాటులో ఉండరని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తమ గ్రామాలను మునిపటిలా పంచాయతీలుగానే మార్చాలని 8 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Intro:అవస్థల మధ్య కు.ని ఆపరేషన్, మంచాలు 30 ఆపరేషన్లు 140

Body:వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం 140 మంది మహిళలకు కు.ని ఆపరేషన్ లు నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి బాలింతలు కొన్ని ఆపరేషన్ల కోసం తో కండ్లు తీసుకోవడం జరిగింది ఆసుపత్రిలో మాత్రం కేవలం 30 మంచాలు మాత్రమే ఉండటంతో ఆపరేషన్ చేసిన తర్వాత వారిని నేలపైన పడుకోబెట్టారు. ఒక మంచం పై ఇద్దరు చొప్పున 60 మందిని మిగతా వారిని నేలపైన పడుకోబెట్టారు. నొప్పి భరించలేక ఇబ్బందులు పడుతున్న మహిళలను ఇలా చేయడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఏర్పాట్లు సరిగ్గా చేయాలని ప్రజలు కోరుతున్న ఇలాంటి ఏర్పాట్లు చేయకుండానే ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారు. కనీసం ఆసుపత్రి బయట సరిపడే టెంటు, సాగునీరు వంటి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మహిళల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం తగదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నప్పుడు వారికి సరిపడే ఏర్పాట్లు చేసి ఉంటే ఇబ్బందులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లకొకసారి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని కావున వందకు పైగా మంచాల ఏర్పాటుచేసి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్, phone no.9866815234
Last Updated : Feb 25, 2019, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.