రోజూవారి కూలీలు తమ సమస్యలను పరిష్కారించాలంటూ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మన్ననూర్ చౌరస్తాలో వానలో తడుస్తూ వినూత్న రితీలో నిరసించారు. అనంతరం డీటీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డీటీడీఓ అధికారి అశోక్‌కు వినతిపత్రం అందించారు.
లేబర్ వేతనాలు పెండింగ్...
గత ఐదు నెలలుగా రోజువారి కూలీ వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘం, సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని అక్రమంగా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అందరిని కొనసాగించాలి..
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరిని కొనసాగించాలని, ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రోజువారి కూలీలు సీఐటీయూ, గిరిజన సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.