నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో భాజపా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి హాజరయ్యారు. 11 కోట్ల సభ్యత్వ నమోదు చేసిన పెద్ద పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భాజపానేనని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదు చేయడంలో ముందుండాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: అటవీశాఖ అధికారిణిపై దాడిని ఖండించిన కేటీఆర్