ETV Bharat / state

'కాంట్రాక్ట్​లపై జుడిషియల్​ కమిషన్​ వేయండి' - naga janardan reddy

కేసీఆర్​కు ధైర్యం ఉంటే కాంట్రాక్ట్​లపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జుడిషియల్ కమిషన్ వేసినట్లు తెలంగాణలో కూడా వేయాలన్నారు కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​ రెడ్డి. నాగర్​ కర్నూల్​లో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

మల్లు రవి, నాగం
author img

By

Published : Jun 2, 2019, 7:46 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​ రెడ్డి ఆధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్​కు ధైర్యం ఉంటే కాంట్రాక్ట్​లపై ఏపీ సీఎం జగన్ జుడిషియల్ కమిషన్ వేసినట్లు తెలంగాణలో కూడా వేయాలని నాగం డిమాండ్​ చేశారు. రాష్ట్రం వచ్చినప్పుడు 60 వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. తెరాస పార్టీ పతనం అవుతుందని మల్లు రవి అన్నారు. ఓడిపోయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

కాంట్రాక్ట్​లపై జుడిషియల్​ కమిషన్​ వేయండి

ఇవీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..

Intro:TG_MBNR_13_2_CONG_FIRE_ON TRS_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) కెసిఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రాలో సీఎం జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ లపై జుడిషియల్ కమిషన్ వేసినట్లు తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల కాంట్రాక్టులు కెసిఆర్ హరీష్రావు కనుసన్నల్లో నడుస్తున్నాయని తెలంగాణ లో జరిగే ప్రాజెక్టులకు జుడిషియల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో మాజీ ఎంపీ మల్లు రవి, డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ తో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కాంట్రాక్టులపై జుడిషియల్ కమిషన్ వేసి టెండర్లకు పిలవడం చాలా ఆనందంగా ఉందని ఆ అవసరం ఆంధ్రా కంటే తెలంగాణలో చాలా అవసరం ఉందని పేర్కొన్నారు. కెసిఆర్ జుడిషియల్ కమిషన్ వేసి తన అవినీతిని ప్రక్షాళన చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం 60 వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకు పోయిందని రాష్ట్రం మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ ఇంతవరకు ఆసరా పెన్షన్ లు రైతు బంధు పథకం ఇంకా అమలు చేయలేదని ఎలక్షన్లలో చెప్పిన హామీలను ఇంతవరకు అమలు పరచలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రాలో జగన్ గెలిచిన రోజే పెన్షన్లను పెంచాడని తెలిపారు.మల్లు రవి మాట్లాడుతూ... నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నీ అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ 40,50000 ఉంటే ఎంపీ స్థానానికి పది ఇరవై వేలకు పడిపోయిందని దీన్ని బట్టి చూస్తే తెరాస పార్టీ రోజురోజుకు పతనమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎంపీగా ఓడిపోయినప్పటికీ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు....AVB
Bytes:- నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీ మల్లు రవి

Body:TG_MBNR_13_2_CONG_FIRE_ON TRS_AVB_C8

Conclusion:TG_MBNR_13_2_CONG_FIRE_ON TRS_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.