నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి సాగునీరందించాలని దుర్వాసుల చెరువు నుంచి అమ్రాబాద్ వరకు భాజపా నాయకులు పాదయాత్ర నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
పదర, అమ్రాబాద్ మండలాలకు సాగు నీరు అందిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు. కనీసం ఇప్పుడు శిలాఫలకం వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుతో వాగ్దానం చేయించారు.
-భాజపా నాయకులు
ఉద్యమం చేస్తాం..
ఎమ్మెల్యేతో ఫలితం లేదని పేర్కొంటూ భాజపా నేతలు ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. పదర, అమ్రాబాద్ మండలాలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం తక్షణమే కృషి చేయాలని కోరారు. లేదంటే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: భాజపాతో స్నేహం చేస్తే కేసీఆర్‌కే నష్టం: సీపీఎం