వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడంటూ నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని గుడిపల్లి గ్రామానికి చెందిన సింధు కాన్పు కోసం ఆదివారం రోజు ప్రగతి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సిజేరియన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చిన సింధు.. ఐదు రోజులుగా ఇదే నర్సింగ్ హోమ్‌లో ఉంటున్నారు. ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం బాబుకు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల బాబు మృతిచెందాడని ఆరోపించిన తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు.
ఇవీ చూడండి: టీవీ9 డైరెక్టర్ మూర్తి పోలీసుల ఎదుట హాజరు