ETV Bharat / state

పెట్రోల్​ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం - Nagarkurnool district latest crime news

తమ పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చేందుకు తహసీల్దార్​ యత్నిస్తున్నారని ఆరోపిస్తూ... నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఓ యువకుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

a man try to suicide at weldanda tehsildar office nagarkarunool district on land issue
పెట్రోల్​ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 14, 2020, 6:29 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ అనే యువకుడి తల్లి పేరు మీద నాలుగు ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చేందుకు వెల్దండ తహసీల్దార్ సైదులు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ... ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాడు.

అనంతరం తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతని నుంచి సీసాను లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. వెల్డండ ఎస్సై నరసింహులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి: రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.