దేవాదుల నీటిని మళ్లించి ములుగు మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జడ్పీ ఛైర్ పర్సన్ కృష్ణ జగదీశ్వరి తెలిపారు. రామప్ప సరస్సు నుంచి నర్సంపేట నియోజకవర్గంలోని రంగయ్య చెరువుకు వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
కొట్లాపూర్ సమీపంలో ఉన్న పంప్‌హౌస్ నిండిన తర్వాత అక్కడి నుంచి నీటిని ములుగు మండలానికి మళ్లిస్తామని వివరించారు. రంగయ్య చెరువు, చింతల చెరువు, జంగాలపల్లి చెరువుల గొలుసుకట్టు ద్వారా నీటిని నింపేందుకు సాధ్యాసాధ్యాలను రైతులను అడిగి తెలుసుకుని నివేదిక తయారు చేస్తున్నామన్నారు.