ETV Bharat / state

దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్నాం: హరీశ్ రావు - కేంద్రంపై హరీశ్ రావు ఆగ్రహం

Telangana Health Profile Pilot Project : రాష్ట్రంలో ఈ హెల్త్‌ ఫ్రొఫైల్‌ ప్రాజెక్టును ములుగులో లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సిరిసిల్ల, ములుగులో 40 రోజుల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి హెల్త్‌ ఫ్రొఫైల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతుందని హరీశ్‌రావు వివరించారు.

Telangana Health Profile Pilot Project
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
author img

By

Published : Mar 5, 2022, 10:47 AM IST

Updated : Mar 5, 2022, 2:49 PM IST

Telangana Health Profile Pilot Project : వైద్యసేవలు మరింత విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ప్రజల సమగ్ర ఆరోగ్య వివరాలను నమోదు చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ను... మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాఠోడ్‌... ములుగు జిల్లాలో ప్రారంభించారు. హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయ‌డంలో భాగంగా వైద్యసి‌బ్బంది ఇంటిం‌టికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమా‌చా‌రాన్ని సేక‌రిస్తారని మంత్రి వెల్లడించారు. 30 రకాల డయా‌గ్నో‌స్టిక్‌ పరీ‌క్షలు నిర్వహించి ఫలి‌తాల ఆధా‌రంగా వారి ఆరోగ్య సమ‌స్యలను నిర్ధా‌రి‌స్తారని తెలిపారు. ఒక‌వేళ ఏవైనా సమ‌స్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారం‌భి‌స్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు హరీశ్‌ రావు తెలిపారు.

Telangana Health Profile Pilot Project
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించాం. ఇది దేశంలో ఎక్కడా లేదు. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో 40 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకోసం 197 మెడికల్ టీమ్స్​ను ఏర్పాటు చేశాం. రూ.10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేశాం. ఇంటింటికీ వెళ్లి అన్నిరకాల పరీక్షలు చేస్తారు. వాళ్ల వివరాలన్నీ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా వాళ్లకు డిజిటల్ కార్డు ఇస్తాం. పేషంట్ బ్యాక్​గ్రౌండ్ హిస్టరీ అంతా తెలిస్తే... డాక్టర్లు వెంటనే వైద్యం చేయగలరు.

-హరీశ్‌ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

కేంద్రంపై హరీశ్ ఫైర్

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను గ్రామపంచాయతీలను చేసినట్లు తెలిపిన మంత్రి హరీశ్‌ రావు.. గిరిజన, ఆదివాసీల విద్య కోసం పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజనులకు ఏడున్నర శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంపై హరీశ్‌ రావు మండిపడ్డారు.

ఈ ప్రాజెక్టును ట్రైబల్ జిల్లాలో ప్రారంభించాం. గిరిజన యూనివర్శిటీ పట్ల కేంద్రం మోసం చేస్తోంది. ఏడేండ్ల నుంచి డబ్బులే ఇవ్వలేదు. రూ.40 కోట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు కలిపి ఇచ్చారు. మళ్లీ గిరిజన యూనివర్శిటీలో గిరిజనులకు కేవలం ఏడున్నర శాతమే ఇస్తారట. ఇది ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీ కూడా ఇస్తున్నాయి. అలాంటప్పుడు గిరిజన యూనివర్శిటీ అని పేరు ఎందుకు పెట్టారు? రాష్ట్రంలో మేం 90 శాతం ఇస్తున్నాం. ఎస్టీల కోసం ఇంటిగ్రేటెడ్ లా కాలేజీలను ఏర్పాటు చేశాం. దీనిపై భాజపా నేతలు సమాధానం చెప్పాలి. గిరిజన యూనివర్శిటీలో 90 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం.

-హరీశ్‌ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

సిలిండర్‌ ధర రూ.వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. భాజపా అధికారంలోకి రాకముందు సిలిండర్‌ ధర రూ.400 ఉంటే... భాజపా పాలనలో సిలిండర్‌ ధర రూ.వెయ్యికి పెంచారని తెలిపారు. రేపో, ఎల్లుండో సిలిండర్‌పై మరో రూ.వంద పెంచుతారని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వల్ల రైతులపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌పై రూ.5 పెంచారని చెప్పారు. మహిళలకు వడ్డీ లేని రుణాలుఈనెలలో విడుదల చేస్తామని వివరించారు.

విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే రూ.5 కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎఫ్‌ డబ్బులు ఇస్తానని కేంద్రం చెప్పింది. వ్యవసాయ బావులు, బోర్ల వద్ద మీటర్లు పెడితే ఏడాదికి రూ.5వేలు ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.25వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పింది. మీటర్లు పెడితేనే డబ్బులు ఇస్తామన్నారు. 25 వేల కోట్లు వద్దు... బావుల వద్ద మీటర్లు వద్దని కేంద్రానికి స్పష్టం చేశాం. ఏపీ సీఎం జగన్‌ దిల్లీ డబ్బులు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టారు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని కేసీఆర్‌ చెప్పారు. 25 వేల కోట్ల కోసం రైతుల ఉసురు పోసుకోమని కేసీఆర్‌ తెగేసి చెప్పారు. మోదీ రాష్ట్రం గుజరాత్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం పంజాబ్‌లో ఉచిత కరెంట్‌ ఇవ్వలేదు. కేవలం తెలంగాణలోనే 24 గంటలూ కరెంటు ఇస్తున్నాం.

- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

గట్టమ్మకు ప్రత్యేక పూజలు

అనంతరం జిల్లా ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. రూ.31 లక్షలతో పీడియాట్రిక్స్ యూనిట్.. రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు. తర్వాత నర్సంపేటలో 66 కోట్లతో నిర్మించే 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌ రావు......టీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. జాకారం వద్ద గట్టమ్మ ఆలయంలో మంత్రులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రుల సంతోషం

ములుగు జిల్లాపై ముఖ్యమంత్రికి ఇంత ప్రేమ ఉండడం సంతోషమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ జిల్లాలో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ములుగు ప్రారంభించడం చాలా సంతోషమని.. ఇది మంచి పరిణామం అని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజనులకు సరైన వైద్యం దొరకడం కష్టం కాబట్టి ముందు అక్కడే హెల్త్ ప్రొఫైల్ ఉండాలని సీఎం కేసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. గిరిజనుల పట్ల సీఎంకు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. టీ- డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 52 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు,తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: KTR Tweet Today : కేటీఆర్‌కు పర్యావరణవేత్త ట్వీట్.. మంత్రి రియాక్షన్ అదుర్స్

Last Updated : Mar 5, 2022, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.