రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కామారం గ్రామంలో శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ప్రజలతో కలిసి వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. మన ఇల్లు, మన గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటామని సీతక్క పేర్కొన్నారు. దోమలు వ్యాపించకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : నల్లమల యురేనియం తవ్వకాలపై నాన్నతో మాట్లాడతా...!