ETV Bharat / state

నిశిరాత్రి నాలుగేళ్ల చిన్నారి అరణ్య రోదన - ములుగు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి తాజా కబురు

ఎముకలు కొరికే చలి.. చిమ్మ చీకటి.. కారడవి... నాలుగేళ్ల చిన్నారి నరకం చూసింది. రాత్రివేళ 10 గంటల పాటు ఆమె ఏడుపు అరణ్యరోదనగా మిగిలిపోయింది. ఇది ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నిని పోగొట్టుకున్న ఆ చిన్నారికి ఎదురైన విషాద ఘటన.

road-accident-one-person-dead-in-mulugu-district-in-telangana
నిశిరాత్రి నాలుగేళ్ల చిన్నారి అరణ్య రోదన
author img

By

Published : Dec 1, 2019, 5:54 PM IST

పిన్ని నిర్జీవంగా పడి ఉంది. మామకు సృహలేదు.. చిట్టి తల్లి సనాకు ఎటుచూసినా చిమ్మ చీకటికి తప్ప మరేమి కనిపించలేదు. భయంతో చీకటి మబ్బులు తొలగేలా రోదించడం తప్ప. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం సమీపంలోని అభయారణ్యంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన ఇధి. మంగపేట మండల కేంద్రంలో నివసించే షేక్‌ రఫియా, రహీంలకు షేక్‌ జిలానీ(25), షేక్‌ సల్మా(23), షేక్‌ సోనీ(20) సంతానం. సల్మాకు వివాహం కాగా, ఏటూరునాగారంలో నివసిస్తోంది. సోనీ, జిలానీ కూడా అక్కడే చిన్న ఉద్యోగాలు చేస్తూ, రోజూ రాత్రి మంగపేటకు వచ్చేస్తుంటారు. సోనీ శుక్రవారం రాత్రి తన అక్క సల్మా కూతురు సనా(4)తో మంగపేటకు బయలుదేరింది. ఆటో కోసం చూస్తుండగా, సోదరుడు జిలానీ మోటారుసైకిలుపై రావడంతో చిన్నారి సనాతో అతడి బండెక్కింది.

ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌ దాటాక వేగంగా వస్తున్న లారీని తప్పించబోయి జిలానీ బైకును చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ఘటనలో సోనీ అక్కడే మృతి చెందింది. జిలానీ ఎడమ కాలు విరిగిపోగా స్పృహ తప్పి పడిపోయాడు. చిన్నారి ఏడ్చినా వినే దిక్కు లేకుండా పోయింది. అర్ధరాత్రి 2 గంటలకు జిలానీకి స్పృహ వచ్చాక... వాహనాల వెలుగులో చూడగా చెల్లెలు సోనీ నిర్జీవంగా పడి ఉంది.

చిన్నారి మేనకోడలు రోదిస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. రాత్రంతా వారి కోసం వెదికిన బంధువులు ఆ ఫోన్‌తో రహదారిపై అన్వేషిస్తూ వచ్చారు. కానీ వెలుగు వచ్చే వరకూ వారిని గుర్తించలేకపోయారు. అనంతరం పోలీసుల సాయంతో క్షతగాత్రులను, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సోనీకి శనివారం పెళ్లి చూపులు జరగాల్సి ఉంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడదామనుకున్న ఆమె ఆశలు గాల్లో కలిసిపోయాయి.

నిశిరాత్రి నాలుగేళ్ల చిన్నారి అరణ్య రోదన

ఇదీ చూడండి: బావిలో పడి యువకుడి ఆత్మహత్య

Intro:tg_wgl_51_30_byke_aduputhappi_yuvathi_mruti_av_ts10072
G Raju mulugu contributor

ఇదే స్లగ్ నేమ్ తో విజువల్స్ వాట్సప్ పంపాను వాడుకోగలరు

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా ఏపీ నగర్ మండల పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. మంగపేట మండలం కి చెందిన జాలని సోనీ ఇద్దరు ఏటూరునాగారం లో బ్రతుకుదెరువు కొరకు జిలాని ఒక షో రూమ్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు. సోనీ నీ అనే మహిళ వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. వీరిద్దరూ పని ముగించుకొని రాత్రి 8 గంటలకు స్వగ్రామమైన మంగపేట ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరితో పాటు ఉ ఉ వల్ల అక్క కూతురు నాలుగేళ్ల సన అనే చిన్నారి కూడా ఉంది. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న తిప్పరు లారీ ఇ వెలుతురుకు రోడ్డు మార్గం కనపడటం అద్భుత రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టడంతో సోనీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సోనీ అన్నయ్య జిలాని సృహ తప్పి పడిపోయాడు వీరితోపాటు ఉన్న చిన్నారి రాత్రంతా అడవిలోనే ఉండి ఏడుపులు అరుపులు ఏ ఒక్కరికి కూడా పడలేదు ఉదయం వరకు కూడా అక్కడికి ఎవరు చేరుకోలేదు ఇంతలో రావడంతో తన బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న బంధువులు చూసి కంటతడి పెట్టారు. వెంటనే దానిని జిలాని , ప్రో కోల్పోయిన చిన్నారిని సామాజిక ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.