ETV Bharat / state

పాఠాలు చెప్పాల్సిన గురువులు భిక్షాటన చేస్తూ... - తమను ఆదుకోవాలంటూ ప్రైవేటు అధ్యాపకుల ఆందోళన

భావితరాలకు భవిష్యత్తు పాఠాలు చెప్పాల్సిన గురువుల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలు తెరవకపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్రైవేటు ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ములుగు జిల్లాకేంద్రంలో భిక్షాటన చేస్తూ కనిపించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

private teachers doing begging in mulugu dist due no work no salaries in coreona situation
పాఠాలు చెప్పాల్సిన గురువులు....భిక్షాటన చేస్తూ
author img

By

Published : Dec 6, 2020, 10:52 PM IST

ప్రైవేటు పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కరోనా వల్ల పాఠశాలలు తెరవకపోవడంతో జీతాల్లేక అర్ధాకలితో అలమటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ ములుగు జిల్లా కేంద్రంలో వినూత్నంగా నిరసన తెలియజేశారు.

జిల్లా ప్రవేట్ టీచర్స్​ ఫోరం అధ్యక్షుడు చాంద్​ పాషా ఆధ్వర్యంలో వీధుల వెంట తిరుగుతూ భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్​ అలీ వారి వెంట ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు జీవన భృతి కల్పించాలని ఆయన కోరారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, ప్రైవేట్​ ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సాగర్, మిర్యాలగూడల్లో ఎత్తిపోతలు.. హాలియాలో డిగ్రీ కాలేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.