ములుగు జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 86 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ హరితహారంపై సదస్సు నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టి హాజరయ్యారు. హరితహారం కార్యక్రమం ద్వారా వెంటనే లాభాలు రావని.. భవిష్యత్తు తరాలకు మేలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ముక్కలు నాటి.. సంరక్షణ చర్యలు చేపడితే భావితరాలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అతి త్వరలో క్రికెట్కు ధోని గుడ్ బై!