ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం... ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరు తప్పించుకుపోయి ఉంటారన్న అనుమానంతో... అటవీ ప్రాంతంలో విస్తృత కూంబింగ్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడపడుతున్నారు.
గోదావరి తీరం పరిసర ప్రాంతాల్లోనూ... మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. కల్వర్టుల వద్ద తనిఖీలు జరుపుతున్నారు. ఆదివారం జరిగిన దాడిని ఖండిస్తూ... జేఎండబ్లూపీ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.
తెరాస ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలని హక్కుల సంఘాలు నిజనిర్ధరణ జరపాలని, హైకోర్టు ద్వారా న్యాయ విచారణ చేపట్టి... హత్యలకు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను కొనసాగిస్తూ... పార్టీని నిర్మూలించేందుకు పథకాలు రచిస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్