ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన జల్లిగంపల లక్ష్మీపతి ఆత్మహత్యకు యత్నించాడు. ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ పంచాయితీ కోసం తహసీల్దార్ వద్దకు వెళ్లారు. రెవెన్యూ అధికారులు అన్నవైపు మొగ్గు చూపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక లక్ష్మీపతి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందే పురుగుల మందు తాగాడు. పక్కవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: అప్పు తీర్చమంటే... చంపి పూడ్చేశాడు...