కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి దహనసంస్కారాలు చేపట్టేందుకు అధికారులు సహకరించట్లేదని కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.... వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుని పరిస్థితి విషమించగా... వరంగల్‌కు తీసుకెళ్లే క్రమంలో... మార్గమధ్యలో మృతి చెందాడు.
మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామమైన జగన్నాధపురానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జేసీబీ వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ్వరూ రాకపోవడం వల్ల... ఈ విషయం అధికారులకు, స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవటం వల్ల తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలిసి మృతదేహంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ శివ ప్రసాద్.... జేసీబీ వాహనాన్ని పంపించి దాహన సంస్కరణలు చేయించారు.