ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ అతిథి కార్యాలయంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నత అధికారులతో మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
మేడారం జాతర పనులు జనవరి 28లోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. జాతరను ప్లాస్టిక్ రహితంగా జరిపేందుకు భక్తులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాలుపంచుకోవాలని కోరారు.
మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
- ఇవీ చూడండి: 'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?'